చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం

81చూసినవారు
చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం
చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని గజపతినగరం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. దత్తిరాజేరు మండలంలోని దాసరిపేట, గదబవలస, చినచామలాపల్లి గ్రామాలలో శ్రీనివాస్ శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాక్షసపాలన అంతానికి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్