దేశంలో తగ్గిన బాల్యవివాహాలు

56చూసినవారు
దేశంలో తగ్గిన బాల్యవివాహాలు
దేశంలో బాల్య వివాహాల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ (ఎన్సీపీసీఆర్‌) తెలిపింది. ఈ మేరకు తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. పౌర సమాజ సంస్థలు, గ్రామ పంచాయతీల జోక్యంతో ఇది సాధ్యమైందని తెలిపింది. 2023-24లో దేశంలో 59,364 బాల్య వివాహాలను అడ్డుకోగా, ఇదే సమయంలో 17 రాష్ట్రాలు, అన్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 265 జిల్లాల్లో ఉన్న 161 పౌర సమాజ సంస్థలు 14 వేలకు పైగా బాల్య వివాహాలను నిరోధించాయి.

సంబంధిత పోస్ట్