
బిల్లలవలసలో ప్రబలిన డయేరియా.. మంత్రి శ్రీనివాస్ ఆరా
బొండపల్లి మండలంలోని బిల్లలవలస గ్రామంలో సోమవారం 16 మంది డయేరియా బారిన పడ్డారు. వారిలో కొంతమంది జిల్లా కేంద్ర ఆస్పత్రిలోను, మరికొందరు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యాధికారి డాక్టర్ సత్యనారాయణ పర్య వేక్షణలో వైద్య శిబిరం నిర్వహించారు. అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. డయేరియా వ్యాప్తికి గల కారణాలపై మంత్రి శ్రీనివాస్ ఆరా తీశారు. కలెక్టర్ అంబేద్కర్ తో మాట్లాడి పరిస్థితి సమీక్షించారు.