గజపతినగరం మండలం పాతబగ్గాo గ్రామంలో ఎంపీయుపి స్కూల్లో విద్యార్థులకు బుధవారం సర్పంచ్ లెంక చిన్నం నాయుడు పాఠ్య పుస్తకాలు, కిట్లు పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ. ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడం జరుగుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం కృష్ణ, పీరు, సన్యాసిరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.