వేపాడ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన డిసిఓ పద్మజ

79చూసినవారు
వేపాడ గురుకుల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన డిసిఓ పద్మజ
వేపాడ గురుకుల పాఠశాలను డిసిఓ పద్మజ శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ నేపథ్యంలో ఆమె ఎఫ్ ఎ 3 పరీక్షల నిర్వహణను, పాఠశాల రికార్డులను, మధ్యాహ్నం భోజన నిర్వహణను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, శత శాతం ఫలితాలను సాధించే విధంగా కృషి చేయాలని ఉపాధ్యాయులకు హితవు పలికారు. ప్రిన్సిపల్ ఫ్లోరెన్స్, వైస్ ప్రిన్సిపల్ ఉషారాణి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్