

జామి: ఏఐహెచ్ఆర్ఏ కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు
విజయనగరం జిల్లా జామి మండలం తాండ్రంగి గ్రామంలో గల అఖిల భారత మానవ హక్కుల సంఘం కార్యాలయంలో బుధవారం ఏఐహెచ్ఆర్ఏ జిల్లా అధ్యక్షులు కొత్తలి గౌరి నాయుడు ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కేక్ కట్ చేసి స్థానిక ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన విద్యార్థులకు మానవ హక్కుల పై అవగాహన కల్పిస్తూ నోట్ పుస్తకాల పంపిణీ చేపట్టారు. పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.