ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను సందర్శించిన ఎంఈఓ

62చూసినవారు
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను సందర్శించిన ఎంఈఓ
వేపాడ మండలం వీలుపర్తి గ్రామంలో గల ఎయిడెడ్ పాఠశాలను అలాగే వెళ్దాంలో గల ప్రాథమిక పాఠశాలను శనివారం ఎంఈఓ బాల భాస్కరరావు సందర్శించారు. ఈ మేరకు ఆయన పాఠశాలలో గల రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్