బొబ్బిలి మండలం పక్కి గ్రామంలో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం కమలానంద భారతీ స్వామీజీ ఆధ్యక్షతన ప్రవచన కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామస్థులు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరై, స్వామీజీ ప్రవచనాలను ఆసక్తిగా శ్రవణం చేశారు. మాజీ ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు జ్యోతి ప్రజ్వలనచేసి ప్రారంభించారు. ఆధ్యాత్మికత పెంపొందించడం గురించి స్వామీజీ వారి సందేశం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.