బొబ్బిలిలో ఘనంగా గురజాడ జయంతి వేడుకలు

56చూసినవారు
బొబ్బిలిలో ఘనంగా గురజాడ జయంతి వేడుకలు
గురజాడ అప్పారావు 162వ జయంతిని పురస్కరించుకొని బొబ్బిలి కోటలో గురజాడ జయంతి వేడుకలను ఎమ్మెల్యే బేబీ నాయన ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. గురజాడ చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సమాజంలో రుగ్మతలను రూపుమాపడానికి మహాకవి గురజాడ చేసిన కృషి చిరస్మరణీయమని, ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలని అన్నారు.

సంబంధిత పోస్ట్