సోమవారం అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి మేలు చేసేలా ఉందని విజయనగరం జిల్లా టిడిపి అధ్యక్షులు కిమిడి నాగార్జున అన్నారు. సోమవారం చీపురుపల్లిలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చం నాయుడు ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్ రైతులకు సహాయకారిగా ఉంటుందని కొనియాడారు. కూటమి ప్రభుత్వంతోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమన్నారు.