విద్యార్థులు మొక్కలు నాటే అలవాటు చేసుకుని పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని చీపురుపల్లిలో గల డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ రాణి శ్రీ కోరారు. మంగళవారం పాఠశాల ఆవరణలో విద్యార్థులతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. మొక్కలను పరిరక్షించి పర్యావరణ సమతుల్యతకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.