ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో అగ్నిస్త్రం తయారీ

76చూసినవారు
ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో అగ్నిస్త్రం తయారీ
బుధవారం గరివిడి మండలం కొండలక్ష్మిపురం గ్రామంలో బెల్లనా తిరుమలరావు మొక్కజొన్నకు కత్తెరపురుగు రావడం జరిగింది. ఆ పురుగు నివారణకు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో అగ్నిస్త్రం తయారీ విధానాన్ని మాస్టర్ ట్రైనర్ ఆ రైతుకి వివరి౦చారు. దేశవాళి ఆవు మూత్రం 150 లీ, పచ్చిమిర్చి10 కే, వెల్లుల్లి 5 కే, పొగాకు కాడలు10 కే. లు, వేపాకులు 30 కేజీలను ఒక పాత్ర తీసుకొని పై పదార్థాలన్నీ అందులో వేసి 3 పొంగులు వచ్చేవరకు మరగబెట్టి తయారుచేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్