దొరికిన పర్స్ ను తిరిగి ఇచ్చి నిజాయితీ ని చాటుకున్న కానిస్టేబుల్

2142చూసినవారు
దొరికిన పర్స్ ను తిరిగి ఇచ్చి నిజాయితీ ని చాటుకున్న కానిస్టేబుల్
విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలంలో గల ఎంపాలేం కు చెందిని కానిస్టేబుల్ సంతోష్ కుమార్ తనకు దొరికిన సుమారు 50 వేలు విలువైన వస్తువులు పది వేలు నగదుతో దొరికిన మనీ పర్స్ ను భాదితలకు తిరిగి అందజేసి తన నిజాయితీ ని చాటుకున్నారు. వివరాల్లోకి వెల్లగా సంతోష్ కుమార్ విశాఖపట్నం బక్కనపాలేం ఎపిపిఎస్సి కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. విశాఖ నుండి స్వగ్రామం అయిన ఎంపాలేం గురువారం వస్తుండగా మానాపురం సమీపంలో రోడ్డుపై పర్స్ దొరికినది. చుట్టుప్రక్కల బాదితలు కోసం గాలించినా ఎవరూ లేకపోవడంతో బుదరాయవలస పోలీసులకు ఆపర్స్ అప్పగించారు. దీంతో బుదరాయవలస పోలీసులు విచారణ జరిపి బాదితులు అయిన దాసరి రాధను గుర్తించి శుక్రవారం సంతోష్ కుమార్ చేతులుమీదుగా పర్స్ ను వారికి అప్పగించారు. రెండు మూడు వేల రూపాయల చిన్నమొత్తానికే ప్రాణాలు తీస్తూ దొంగతనాలు చేస్తున్న ఈ తరుణంలో దొరికిన పర్స్ ను పోలీసు ద్వరా అప్పగించిన సంతోష్ కుమార్ ను పోలీస్ సిబ్బంది తో పాటు పలువురు కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్