రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల అక్రిడేషన్ (గుర్తింపు కార్డు) గడువును మరో 3 నెలల పాటు పొడిగిస్తూ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ హరీశ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 31న అక్రిడేషన్ కార్డుల గడువు ముగియనుంది. ఈ గడువును మరో మూడు నెలల పాటు పొడిగిస్తున్నట్లు ఐ అండ్ పీఆర్ అధికారులు పేర్కొన్నారు. జనవరి 1 నుంచి మార్చి 31 వరకు అక్రిడేషన్ల గడువును పొడిగిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు, ఆర్టీసీ సంస్థకు అధికారులు తెలియజేశారు.