కురుపాం నియోజకవర్గం కొమరాడ మండలం పెదకేర్జల గ్రామ సమీపంలో ఉన్న జీడి తోటలలో గజరాజుల గుంపు సంచరిస్తుంది. దీంతో ఆ ప్రాంత వాసులు భయాందోళన చెందుతున్నారు. ముఖ్యంగా రహదారికి పక్కనే ఉన్న తోటలో ఏనుగుల గుంపు తిష్ఠ వేయడంతో ఎప్పుడు ఎవరిపై దాడి చేస్తాయో అనే భయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఈ ప్రాంతం నుంచి ఏనుగుల గుంపును తరలించాలని సోమవారం వారు డిమాండ్ చేస్తున్నారు.