గునుకుండవలసలో జనసేన నేతల పర్యటన
జనసేన మక్కువ మండల ఉపాధ్యక్షులు సుగుణేశ్వరరావు, బీసీ కోఆర్డినేటర్ బోన్ పాపారావు, చప్పబుచ్చంపేట పంచాయితీ గునుకొండవలస గ్రామంలో మంగళవారం పర్యటించారు. అక్కడ ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో త్రాగునీటి మోటర్ ట్యాంక్ తాలూకా కరెంటు మీటర్ పాడైపోయిందని అందువలన త్రాగునీరు కోసం ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. సమస్యను మంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.