నర్సీపట్నం: చికిత్సకు రూ. 26, 000 ఆర్థిక సహాయం
నర్సీపట్నంలోని ఓ పాఠశాలలో చదువుతున్న సాహిత్య ఇటీవల ఎన్టీఆర్ స్టేడియంలో ఆడుతూ ఐరన్ రాడ్స్పై పడి గాయాలపాలైంది. దీంతో బాలికను విశాఖ ఆసుపత్రిలో చూపించగా కిడ్నీలో రక్తం గడ్డ కట్టిందని, దానికి సర్జరీ అవసరమని వైద్యులు తెలిపారు. సామాజిక మాధ్యమాల ద్వారా విషయం తెలుసుకున్న హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షుడు టీ. మల్లేష్ సభ్యులు, దాతల సహకారంతో రూ. 26వేలు సేకరించి శనివారం పాఠశాల టీచర్లకు అందజేశారు.