నర్సీపట్నం: ఆర్థిక ఇబ్బందులతోనే ఆర్మీ జవాన్ ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులతోనే ఆర్మీ జవాన్ ఆత్మహత్య చేసుకున్నట్లు నర్సీపట్నం సీఐ గోవిందరావు శనివారం తెలిపారు. నాతవరం మండలానికి చెందిన బి. శివ అప్పలనాయుడు కాశ్మీర్లో పనిచేస్తూ ఇటీవల హైదరాబాద్కు బదిలీపై వచ్చినట్లు పేర్కొన్నారు. స్వగ్రామం వచ్చిన జవాన్ ఈనెల ఆరవ తేదీన నర్సీపట్నంలో లాడ్జిలో ఆత్మహత్య చేసుకున్నారు. భార్య హేమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.