నర్సీపట్నం: రైతుల సంక్షేమాన్ని విస్మరించిన విశాఖ డెయిరీ
విశాఖ డెయిరీ రైతుల సంక్షేమాన్ని విస్మరించి స్వలాభం కోసం మాత్రమే పనిచేస్తోందని ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. బుధవారం నర్సీపట్నంలోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్ని పార్టీల నాయకులు కలిసి రైతుల సమస్యపై పోరాడవలసిన అవసరం ఉందని, రాజకీయాలు పక్కన పెట్టి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.