నర్సీపట్నం: నేడు పోలీస్ స్టేషన్ ఎదుట శాంతియుత ధర్నా

60చూసినవారు
ఈ నెల 6న నర్సీపట్నం పోలీస్ స్టేషన్ ఎదుట శాంతియుత ధర్నా చేపడతామని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మంగళవారం స్పష్టం చేశారు. గత నెలలో నర్సీపట్నం ఇసుక స్టాక్ పాయింట్ లో ఇసుక దోపిడి జరుగుతున్నందున తమ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు వెళ్లి అడ్డుకున్నారన్నారు. అయితే పోలీసులు దోపిడి దొంగలకు అండగా ఉండటమే కాకుండా తమ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టారన్నారు. దీనికి నిరసనగా ఈ శాంతియుత ధర్నా చేపడుతున్నామన్నారు.

సంబంధిత పోస్ట్