పాలకొండ నియోజకవర్గ ప్రజలకు ఏపీ ఎస్ డిఎంఎ నుంచి కీలక సూచనలు

50చూసినవారు
పాలకొండ నియోజకవర్గ ప్రజలకు ఏపీ ఎస్ డిఎంఎ నుంచి కీలక సూచనలు
పాలకొండ నియోజకవర్గంలో మంగళవారం తీవ్ర వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. పాలకొండలో 47. 9, సీతంపేటలో 47. 3, వీరఘట్టంలో 48. 6, భామినిలో 47. 5 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసింది. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో రేపు తీవ్ర వడగాలులు వీస్తాయని హెచ్చరిస్తూ ఏపీఎస్డిఎంఏ ఈ మేరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

సంబంధిత పోస్ట్