పార్వతీపురం మండలంలోని నర్సిపురం గ్రామ సమీపంలో ఐదు ఎకరాలలో భూమిలో సుమారు ఐదు సంవత్సరాలుగా సాగు చేసిన సుమారు 250 కొబ్బరి మొక్కలను ఆదివారం ధ్వంసం చేసాయి. ఏనుగుల వలన నష్టపోయిన రైతు కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. ఏనుగుల సమస్య పరిష్కరించాలని తక్షణమే ఏనుగులను దూరంగా తరలించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. స్థానికులు భయాందోళన చెందుతున్నారు.