Sep 22, 2024, 12:09 IST/మంచిర్యాల
మంచిర్యాల
30న బీడీ కార్మికుల హక్కుల సాధనకై ధర్నా
Sep 22, 2024, 12:09 IST
బీడీ కార్మికుల హక్కుల సాధనకై ఈ నెల 30న హైదారాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహిస్తున్నట్లు ఐఎఫ్టీయూ జిల్లా నాయకులు మంతెన మల్లన్న తెలిపారు. ఆదివారం నస్పూర్ లోని బీడీ కంపెనీ కార్యాలయం వద్ద నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీడీ కార్మికులకు కనీస వేతనాల జీఓ విడుదల చేయాలని, చేయూత పథకం కింద జీవన భృతి నెలకు రూ. 4 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్నాలో బీడీ కార్మికులు పాల్గొనాలని కోరారు.