భైంసా పట్టణ కేంద్రంలోని వార్డు నెంబర్ 10లోని మేదరి సంఘ భవన నిర్మాణం కోసం 2 లక్షల 50వేల రూపాయలు మంజూరైనట్లు మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తెలిపారు. మంజూరైన ప్రొసీడింగ్ కాపీని మంగళవారం సంఘ సభ్యులకు అందజేశారు. నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కకు సంఘ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.