భైంసాలో మంగళవారం అయ్యప్ప స్వామి ఆరట్టు ఉత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాయినాథ్ గురుస్వామి ఆధ్వర్యంలో ఉదయం స్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేసి స్వామి వారి ఉత్సవ విగ్రహాలను హరిహర క్షేత్రం నుంచి పట్టణ ప్రధాన వీధుల గుండా అయ్యప్ప స్వాములు ఊరేగించారు. పట్టణంలో మహిళలు హారతులతో స్వామి వారి ఊరేగింపునకు స్వాగతం పలికారు. అయ్యప్ప నామ స్మరణతో ప్రధాన విధులు మారుమోగాయి.