Feb 12, 2025, 17:02 IST/
LIVE VIDEO: ఘోర ప్రమాదం.. ట్రాక్టర్ కింద పడి బాలుడి మృతి
Feb 12, 2025, 17:02 IST
మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొందరు విద్యార్థులు పరీక్ష రాసి ట్రాక్టర్ ఎక్కి ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో శ్రీధర్ సంజయ్ (14) అనే యువకుడు ట్రాక్టర్ డ్రైవర్‌కు తాను దిగాల్సిన స్టాప్ వచ్చిందని చెప్పకుండానే ట్రాక్టర్ నుంచి దూకాడు. దీంతో బాలుడు ప్రమాదశాత్తు ట్రాక్టర్ చక్రాల కింద నలిగి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.