మహిళ మెడలో పుస్తెలతాడు చోరీ
మహిళ మెడలో పుస్తెలతాడును దుండగులు తెంపుకుపోయిన ఘటన మండలంలో చోటు చేసుకుంది.రేగిడి మండలం ఉణుకూరు గ్రామానికి చెందిన మజ్జి భారతి తోటి కూలీలతో సోమవారం ఉదయం గ్రామంలో వ్యవసాయ పనులకు వెళ్లింది. మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఇంటికి వస్తుండగా భారతిని ద్విచక్రవాహనంపై వస్తున్న ఇద్దరు దుండగులు వెంబడించి వెనకనుంచి తులంన్నర పుస్తెలతాడును తెంపుకుని పారిపోయారు. ఆమె కేకలు వేసినా చుట్టు పక్కల ఎవ్వరూ లేకపోవడంతో ఫలితం లేకపోయింది. ఏఎస్ఐ రాజారావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.