తాళం వేసిన ఇంట్లో చోరీ... కేసు నమోదు చేసిన పోలీసులు
రేగిడి ఆమదాలవలస మండలంలోని దేవుదల గ్రామంలో శనివారం అర్ధరాత్రి పాలవలస కృష్ణ ఇంటిలో దుండగులు చోరీకి పాల్పడ్డారని పోలీసులు ఆదివారం తెలిపారు. కాశిపుణ్య క్షేత్రానికి కృష్ణ కుటుంబ సమేతంగా వెళ్లారు. ఊరు శివారులో ఇల్లు ఉండడంతో ఇంటి వెనక కిటికీలు తీసి చోరీకి పాల్పడ్డారు. ఎస్ఐ పి.నీలావతి ఆదివారం సంఘటన స్థలానికి చేరుకొని గ్రామస్థుల నుంచి సమాచారం సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి ధైర్యప్తు చేస్తున్నారు.