బొబ్బిలి ప్రభుత్వ ఐటిఐలో, ప్రధానమంత్రి కౌశిక్ వికాస్ (పిఎంకెవివై) యోజన పథకం కింద, మూడు నెలల స్వల్పకాలిక టెక్నికల్ కోర్సులలో, ఉచితంగా శిక్షణ ఇచ్చుటకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ రమణరావు ఒక ప్రకటనలో తెలియజేశారు. 10వ తరగతి పాస్ అయినా, ఫెయిల్ అయినా సరే పరవాలేదు, అటువంటి వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని తెలియజేశారు. శిక్షణాకాలంలో మూడు నెలల పాటు బస్సు పాస్ సౌకర్య కూడా కల్పించబడునని తెలియజేశారు.