మక్కువ పోలీస్ స్టేషన్ ను గురువారం పార్వతీపురం ఏఎస్పీ అంకిత సురన ఆకస్మిక తనిఖీ చేసారు. పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందితో విధులు గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విధులు పట్ల సిబ్బంది నిర్లక్ష్యం వహించరాదని అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి ఆదేశించారు.