
సాలూరు: శంబర శ్రీ పోలమాంబ జాతరకు ఉత్సవ కమిటీ ఏర్పాటు
ఉత్తరాంద్రుల ఆరాధ్య దైవం మక్కువ మండలం శంబర శ్రీ పోలమాంబ అమ్మవారి జాతరకు ఉత్సవ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఉత్సవ కమిటీ గ్రామ పెద్దలందరూ కలిసి ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవాలని శుక్రవారం మంత్రి సంధ్యా రాణి సూచించారు. ఉత్సవ కమిటీ ఛైర్మన్ గా నైదాన తిరుపతిరావు, మెంబర్లుగా ఏ. గణపతిరావు, జె. భాస్కరరావు, ఆర్.వెంకటరమణ, జి.భవానీ, పి. నారాయణ, వి.రాజమాణిక్యం, ఎస్.సత్తెమ్మ, జి.లలితలను నియమించింది.