సాలూరు నుంచి మక్కువ వెళ్లే రహదారి చెరువులను తలపిస్తున్నాయి. సాలూరు పట్టణం మక్కువ బైపాస్ నుంచి మక్కువ వరకు అడుగడుగునా పెద్ద గోతులతో ప్రమాదకరంగా మారింది. గత రెండు రోజులుగా వర్షాలు కురవడంతో ఆ గోతుల్లో నీళ్లు నిండి చెరువుల్లాగా కనిపిస్తున్నాయి. నిత్యం సాలూరు నుంచి మక్కువ చిరు వ్యాపారులు ద్విచక్ర వాహనంపై సరుకులు తీసుకు వెళ్తుండగా నీళ్లు నిండిన గోతుల్లో పడిపోయి విలువైన సరుకులు నష్టపోతున్నారు.