కార్తీక ఏకాదశి పురస్కరించుకొని సాలూరు పట్టణంలోని శ్రీ శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ఏకాదశి పూజలు అత్యంత వైభవంగా భక్తులు నిర్వహించారు. మంగళవారం ఉదయం 3 గంటల నుంచి ఆలయం వద్ద భక్తులు క్యూ కట్టారు. ఆలయ ప్రాంగణంలో వేల సంఖ్యలో భక్తులు బారికేడ్లలో గంటలు తరబడి నిల్చుని స్వామిని దర్శించుకున్నారు. కలువ పూలతో వేణుగోపాలస్వామిని అలంకరించారు. తులసి మొక్క, ధ్వజస్తంభం, ఉసిరిక, రావి వృక్షానికి భక్తులు పూజలు చేశారు.