ఏకలవ్య ఫౌండేషన్ పాడేరు వాటర్ షెడ్ మేనేజర్ ఎం. ఉమా వెంకటేష్ ఆధ్వర్యంలో 20 మంది రైతులు పాచిపెంట మండలంలో పాదు కూరగాయల సాగును పరిశీలించారు. మంగళవారం మండలంలో పి. కోనవలస, తెట్టెడు వలస, మాతమూరు, పాచిపెంట గ్రామాలలో సాగులో ఉన్న వివిధ కూరగాయల నమూనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పాచిపెంట మండల వ్యవసాయ కార్యాలయంలో ఉన్న ప్రకృతి సేద్య వనరుల కేంద్రాన్ని సందర్శించారు.