సంతకవిటి: 30 మద్యం సీసాలు స్వాధీనం
సంతకవిటి మండల కేంద్రం జంక్షన్ వద్ద వాహనాల తనిఖీలలో భాగంగా అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం. కాకరాపల్లికి చెందిన వ్యక్తి వద్ద అక్రమంగా తరలిస్తున్న 30 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని, అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ గోపాలరావు బుధవారం తెలిపారు.