TG: భద్రాద్రి కొత్తగూడెంలో మహిళ మిస్సింగ్ కేసు విషాదాంతం అయింది. సింగరేణిలో ఉద్యోగం కోసం స్వాతి, వీరభద్రం అనే వ్యక్తులకు పార్వతి-రత్నకుమార్ దంపతులు రూ.16 లక్షలు ఇచ్చారు. ఉద్యోగం రాకపోవడంతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆ రూ.16 లక్షలపై ఆశపడి స్వాతిని వీరభద్రం చంపేశాడు. 20 ముక్కలుగా నరికి పొలాల్లో పడేశాడు. ఆ మృతదేహాన్ని స్వాతిగా పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.