డ్యాన్స్ చేస్తూ గుండెపోటుకు గురైన యువకుడు

64చూసినవారు
డ్యాన్స్ చేస్తూ గుండెపోటుకు గురైన యువకుడు
సంతకవిటి మండలం పొనుగుటివలస గ్రామంలో వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. శుక్రవారం రాత్రి వినాయక నిమజ్జనం కార్యక్రమంలో డీజేకు డ్యాన్స్ చేస్తున్న గ్రామానికి చెందిన వావిలపల్లి వినయ్ గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే స్నేహితులు అతడిని రాజాంలో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతడి ఆరోగ్యం పరిస్థితి విషమించడంతో విశాఖపట్నంలో ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స పొందుతున్నాడు.

సంబంధిత పోస్ట్