ముంబై ట్రాఫిక్ పోలీసులకు నవంబర్ 7న ఓ నెంబర్ నుంచి బెదిరింపు మెసేజ్‌లు వచ్చాయి. తాను బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందినట్లు, 5 కోట్లు ఇవ్వకుంటే సల్మాన్‌ను చంపేస్తానని బెదిరించాడు. అయితే ఈ మెసేజ్ కర్నాటకలోని రాయ్‌చూర్‌కు చెందిన సోహెల్ పాషా అనే సాంగ్‌రైటర్ పంపినట్లు గుర్తించారు. అతన్ని పోలీసులు అరెస్టు చేశారు. అయితే సోహెల్ రాసిన ఓ పాట ఫేమస్ కావాలన్న ఉద్దేశంతో సల్మాన్‌ను బెదిరించాడని పోలీసులు తెలిపారు.