ఉత్తరాపల్లి గ్రామంలో పల్లెల ప్రసిద్ధి సాంప్రదాయ కళ అయిన చిరతలు భజన గ్రూప్ వారికి గ్రామ టీడీపీ యువ అధ్యక్షులు మిడతాన నాయుడు 30 మందికి చీరలు పంపిణీ చేయటం జరిగింది మిడతాన నాయుడు మాట్లాడుతూ... మన దేశానికి పల్లెలే పట్టుకొమ్మలు అని, మన పల్లెల సంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శం అని ఇలాంటి సాంప్రదాయ కళలు కనుమరుగు అవ్వకుండా కాపాడుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిరతలు భజన గ్రూప్ గురువు అయిన సింగంపల్లి ఎర్నాయుడు, గ్రామ టీడీపీ ఉపాదక్షులు సింగంపల్లి ప్రకాష్,ప్రధాన కార్యదర్శి గాడి ప్రసాద్, గ్రామ టీడీపీ రైతు అధ్యక్షులు రెడ్డి రాము, సింగంపల్లి వామాలు గారు,మలిరెడ్డి సత్యనారాయణ, శంకర్, శివ, చిన్న, గణేష్, గ్రామ పెద్ద అయిన షైక్ సయ్యద్ పాల్గొన్నారు.