ఎస్ కోట మండలంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం

83చూసినవారు
ఎస్ కోట మండలంలో శనివారం మధ్యాహ్నం వాతావరణంలో ఆకస్మికంగా మార్పులు చోటుచేసుకుని ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. వర్షం కురిసేటప్పుడు భారీ శబ్దాలతో ఉరుములు, మెరుపులు రావడంతో ప్రజలు ఒకింత భయాందోళనలకు గురయ్యారు. పాఠశాలలు విడిచి పెట్టే సమయం కావడంతో పిల్లల రాక కోసం తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనతో ఎదురు చూశారు. కురిసిన వర్షం ఖరీఫ్ పంటలు సాగుకు అనుకూలంగా ఉంటుందని రైతన్నలు చెబుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్