కొత్తవలస మండలం కంటకాపల్లి గ్రామానికి చెందిన సేనాపతి గణేష్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ మండల అధ్యక్షులు నక్కరాజు సతీష్ శనివారం నాడు కంటకాపల్లి గ్రామానికి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబానికి ధైర్యం చెప్పారు. ఆయన మాట్లాడుతూ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చరవాణిలో ప్రగాఢ సానుభూతి తెలియజేశారని చెప్పారు. సేనాపతి గణేష్ క్రియాశీలక సభ్యత్వం చేసుకోవడం వల్ల త్వరలోనే పార్టీ తరపు నుండి వచ్చే ఇన్సూరెన్స్ 500000 ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు.