

విశాఖపట్నంలో విస్తృతంగా తనిఖీలు
విశాఖ జిల్లాలోని గత కొన్ని రోజులుగా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా జిల్లా సరిహద్దు ప్రాంతాలైన సబ్బవరం, తగరపువలస, ఆనందపురంలోని గండిగుండం చెక్ పోస్టుల వద్ద ప్రజల భద్రత దృష్ట్యా గంజాయి రవాణాపై వాహనాలను ఆపి తనిఖీ చేశారు. గంజాయిని అరికట్టడంపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో వాహనాలను విస్తృతంగా తనిఖీ చేస్తున్నట్లు పోలీసులు బుధవారం తెలిపారు.