విశాఖ జిల్లా కొమ్మాది సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల వేదికగా ఏర్పాటు చేసిన జోనల్ స్థాయి సైన్స్ ప్రదర్శనను జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్ సోమవారం ప్రారంభించారు. వివిధ అంశాలపై విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను ఈ సందర్భంగా తిలకించి అభినందించారు. ఉత్తరాంధ్ర పరిధిలోని ఉమ్మడి జిల్లాల్లోని పాఠశాలల విద్యార్థులు వివిధ అంశాలపై ప్రాజెక్టులు రూపొందించారు.