మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని స్థానిక టిడిపి మండల అధ్యక్షుడు
టి సుబ్బారావు చెప్పారు. శనివారం అల్లూరు జిల్లాలో అనేక చోట్ల ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాలు నిర్వహించారు. దానిలో భాగంగా డుంబ్రిగూడ మండలంలోని గుంటగన్నెల పంచాయతీ కబడ జాముగుడలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. 100రోజుల్లో కూటమి ప్రభుత్వం చేపట్టిన విజయాలు తెలియజేశారు.