డేన్ ఫౌండేషన్ అధినేత విరాళం

685చూసినవారు
డేన్ ఫౌండేషన్ అధినేత విరాళం
కె కోటపాడు మండలం కొరువాడ జడ్పీహెచ్ స్కూల్లో 1997వ సంవత్సరంలో 10వ తరగతి చదువుకున్న పూర్వ విద్యార్థుల్లో ఒకరైన డెక్క అప్పారావుకు తోటి విద్యార్థులు అందరూ కలిసి గృహ నిర్మాణం కొరకు లక్ష రూపాయలు విరాళంగా అందజేశామని విద్యార్థుల్లో ఒకరైన డేన్ ఫౌండేషన్ అధినేత దొగ్గ అచ్చం నాయుడు ఆదివారం విలేకరులకు తెలియజేశారు. అందులో భాగంగా అచ్చం నాయుడు అప్పారావుకు ఆదివారం 20 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసినట్లు ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా అచ్చం నాయుడు మాట్లాడుతూ.. ఆర్థికంగా వెనకబడిన తమ స్నేహితుడైన అప్పారావుకు మేమందరం కలిసి కొంత సహాయం చేయడం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు. అదేవిధంగా ఎవరికైనా ఇబ్బందులు ఉంటే ఆదుకునేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నావని ఈ సందర్భంగా తెలియజేశారు.

సంబంధిత పోస్ట్