ఆకులు తొడిగిన రోదసి సేద్యం

62చూసినవారు
ఆకులు తొడిగిన రోదసి సేద్యం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) రోదసిలోకి పంపిన అలసంద విత్తనాల నుంచి తొలిసారిగా లేలేత ఆకులు పుట్టుకొచ్చాయి. ఇవి ఇటీవలే మొలకెత్తిన సంగతి తెలిసిందే. రోదసిలో మొక్కల సాగును చేపట్టగల తమ సత్తాకు ఇది నిదర్శనమని ఇస్రో పేర్కొంది. అంతరిక్షంలో ఆహారాన్ని పండించే విధానాలపై పరిశోధనల కోసం ‘కంపాక్ట్ రీసెర్చ్ మాడ్యూల్ ఫర్ ఆర్బిటల్ ప్లాంట్ స్టడీస్’ (క్రాప్) అనే ఈ ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది.

సంబంధిత పోస్ట్