సాయిబాబా ఆలయంలో ఘనంగా దీపోత్సవం

164చూసినవారు
సాయిబాబా ఆలయంలో ఘనంగా దీపోత్సవం
అనకాపల్లి జిల్లా, కె కోటపాడు స్థానిక శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో కార్తీకమాసం ఆఖరి రోజున కార్తీక మాస దీపోత్సవ కార్యక్రమం బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. షిరిడి సాయిబాబా ఆలయం ప్రాంగణం అంతా దీపాలతో కళకళలాడింది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు గోరుగొంతు రమేష్ బాబు మాట్లాడుతూ కార్తీక మాసంలో శివునికి చాలా ఇష్టమైన దీపోత్సవ కార్యక్రమం ఆలయ ప్రాంగణంలో జరగడం చాలా ఆనందకరంగా ఉందని అన్నారు. మూడు వేల మూడు వందల ముప్పైమూడు పరిమితులతో ఈ దీపోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. యొక్క కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని దీపాలను భక్తి శ్రద్ధలతో వెలిగించి ఆ మహాశివుని మరియు శ్రీ శిరిడి సాయిబాబా ఆశీస్సులు పొందారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వేగి రామారావు, యాళ్ల సాయి, యలమంచిలి ధర్మారావు, అప్పలబత్తుల రవి శంకర్ , మేడపరెడ్డి శివ , శ్రీమంతుల శ్రీను స్వామి మరియు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్