కె. కోటపాడు శిరిడి సాయి ఆలయంలో పేదలకు రగ్గులు పంపిణీ

256చూసినవారు
కె. కోటపాడు శిరిడి సాయి ఆలయంలో పేదలకు రగ్గులు పంపిణీ
సామాజిక సేవా కార్యక్రమాలు మనస్సుకు సంతృప్తిని ఇస్తాయని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం చైర్మన్ వేగి రామారావు అన్నారు. స్థానిక షిర్డీ సాయి ఆలయం లో ప్రతి గురువారం జరుగు అన్నదానం సందర్భంగా నిరుపేదలకు రగ్గులు పంపిణీ జరిగింది. బైలపూడి రవి, గౌరి దంపతుల ఆర్థిక సహాయంతో ఈ వారం అన్నదానం తో పాటుగా రగ్గులు కూడా పంపిణీ చేశారని రామారావు అన్నారు. అదే విధంగా ఎఫ్. సి. గోడౌన్ సిబ్బంది ఈ అన్నదానం కు సహకరించారని అన్నారు. ఈ సేవా ఆలయ కమిటీ సెక్రటరీ యాళ్ళ సాయి నేతృత్వం లో జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు మహిళా సేవకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్