శ్రీ సీతా రాములు ఆలయ నిర్మాణానికి విరాళం: వేగి రామారావు

564చూసినవారు
శ్రీ సీతా రాములు ఆలయ నిర్మాణానికి విరాళం: వేగి రామారావు
అనకాపల్లి జిల్లా కె. కోటపాడు మండలంలోని యడ్లవానిపాలెం గ్రామంలో నూతనం గా నిర్మిస్తున్న శ్రీ సీతారామాంజనేయ ఆలయానికి బుధవారం వేగి రామారావు పదివేల రూపాయలు విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ గ్రామాల్లో ఆలయాల నిర్మాణం ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. అదేవిధంగా కె. కోటపాడు శ్రీ షిరిడి సాయి ఆలయ కమిటీ తరఫున పదివేల రూపాయలు విరాళంగా అందజేస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ వేగిరామారావు అన్నారు. యడ్లవానిపాలెం గ్రామంలో ఈ ఆలయ నిర్మాణం చేయడము ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు యడ్ల రమణమ్మ, సి. సి. నాయుడు మరియు మహిళలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్