ఉత్తమ లఘు చిత్ర దర్శకుడు అవార్డు పొందిన వేగి రామారావు

903చూసినవారు
ఉత్తమ లఘు చిత్ర దర్శకుడు అవార్డు పొందిన వేగి రామారావు
గ్రామీణ ప్రాంతాలకు లఘు చిత్రాలును పరిచయం చేసి, మట్టిలో మాణిక్యాలను వెలుగులోకి తీసుకొచ్చి, అనతి కాలంలోనే 30 లఘు చిత్రాలును రచించి, దర్శకత్వం వహించిన వేగి రామారావు ఉత్తమ దర్శకుడు, ఉత్తమ లఘు చిత్రాల అవార్డు గెలుచుకున్న వేగి నీ పలువురు ప్రశంసలు కురిపించారు. సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చే పలు లఘు చిత్రాలు ను ఆయన నిర్మించారు. శుక్రవారం ఉమ్మడి రాష్ట్రం హైదరాబాదులో హోలీ ఫ్రీన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన భారత ఉత్తమ సేవారత్న 2023 అవార్డులో భాగంగా కె. కోటపాడు గ్రామానికి చెందిన వేగి రామారావు అవార్డు అందుకున్నారు. ఉమ్మడి రాష్ట్రం నుండి వివిధ కేటగిరీల లో సుమారుగా 100 మంది కి అవార్డులు అందగా అందులో అనకాపల్లి జిల్లా నుండి నలుగురు వ్యక్తులు వివిధ కేటగిరీలలో ఉత్తమ అవార్డులు గెలుచుకున్నారు. సబ్బవరం మండలం, బాట జంగాల పాలెం గ్రామానికి చెందిన పాలిసెట్టి అప్పారావు ఉత్తమ రచయిత అవార్డు అందుకున్నారు అని తెలిపారు. అప్పారావు పలు లఘు చిత్రాలు రచించారు. ఈ సందర్భంగా హోలీ ప్రిన్స్ స్వచ్ఛంద సంస్థను కొనియాడారు.

సంబంధిత పోస్ట్